English | Telugu
నన్ను కర్రలతో కొడతారా అయితే నేను సూర్య నమస్కారాల సంఖ్య పెంచుతా: ప్రధాని మోడీ
Updated : Feb 7, 2020
ఇరవై ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొన్నా, ఇప్పుడు రాటుదేలిపోయా. నన్ను కర్రలతో కొడతారా, అయితే నేను సూర్య నమస్కారాల సంఖ్య పెంచుతా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన కామెంట్ లకు అదే రేంజ్ లో కౌంటరిచ్చారు ప్రధాని మోడీ. ఇటు నెహ్రూపై సైతం డైరెక్ట్ ఎటాక్ చేశారు. లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగం మొత్తం రాహుల్ కాంగ్రెస్ టార్గెట్ గా కొనసాగింది. తనదైన స్టైల్ లో సమాధానమిచ్చారు. ఓ వైపు కౌంటర్ ఇస్తూనే సెటైర్ లు వేశారు. ఆరు నెలల్లో నిరుద్యోగ సమస్య పరిష్కరించకుంటే మోడీని యువత కర్రలతో బాదుతారన్న రాహుల్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. కర్రల దాడిని తట్టుకునేందుకు తాను ప్రతిరోజూ చేసే సూర్యనమస్కారాల సంఖ్యను పెంచాలనుకుంటున్నట్టుగా చెప్పారు. రాహుల్ ని ట్యూబ్ లైట్ తో పోల్చారు ప్రధాని. ఆయన పేరు ప్రస్తావించకుండానే సెటైర్ లు వేశారు.
తాను నలభై నిమిషాల నుంచి మాట్లాడితే ఇప్పుడు కరెంటు పాసైందని రాహుల్ ను ఉద్దేశించి కామెంట్ లు చేశారు మోడీ. మోడీ స్పీచ్ పై కౌంటరిచ్చారు రాహుల్, గంటన్నర ప్రసంగంలో యువత గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదన్నారు. తొలి ప్రధాని నెహ్రూను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు ప్రధాని మోడీ. ప్రధాన మంత్రి పదవి కోసం ఓ నేత దేశాన్ని చీల్చారని వ్యాఖ్యానించారు. సీఏఏ ని వ్యతిరేకిస్తే నెహ్రూ విధనాలు వ్యతిరేకించినట్లే అన్నారు మోడీ. బంగ్లా నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వ కల్పనకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలని నెహ్రూ చెప్పారన్నారు. ఇందుకు గతంలో అస్సాం ముఖ్యమంత్రికి నెహ్రూ రాసిన లేఖే నిదర్శనమన్నారు మోడీ.