English | Telugu

ప్రజలకంటే పేకాట క్లబ్‌లే ముఖ్యం ! కొడాలి నానికి పవన్ పంచ్ 

కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధికార పార్టీని టార్గెట్ చేశారు. గుడివాడ రాగానే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నానిపై పంచ్‌లు వేశారు. పేకాట క్లబ్‌లపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని విమర్శించారు. గుడివాడలో రోడ్లు అధ్వన్నంగా ఉన్నాయని ప్రజలు రహదారులను బాగుచేయాలని ఎమ్మెల్యేను నిలదీయాలన్నారు. పేకాట క్లబ్‌లు నిర్వహించడంలో ఉన్న సమర్థత.. ప్రజాపాలన ముందుకు తీసుకువెళ్లడంలో మంత్రికి లేదని మండిపడ్డారు పవన్ కల్యాణ్.

ఒక వర్గానికి చెందిన మీడియా సంస్థల్లో ఇష్టమొచ్చినట్లు దురుసుగా మాట్లాడితే కుదరదని పవన్ హెచ్చరించారు. నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే భరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు జనసేనాని. రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయన్నారు. మార్పు రావాలని, అందరికీ న్యాయం జరగాలన్నారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.