English | Telugu
స్కూలు టీచర్‌కు మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ
Updated : Dec 4, 2020
2009 లో పరితేవాడిలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు డిసేల్ వచ్చినప్పుడు.. ఆ పాఠశాల దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేది. ఈ పరిస్థితిని ఛాలెంజింగ్ గా తీసుకున్న డిసేల్ పాఠశాల రూపురేఖలు మార్చారు. దీంతో పాటు గ్రామంలోని 100శాతం బాలికలను పాఠశాలకు హాజరయ్యేలా కృషి చేశారు. అలాగే గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా నిలువరించగలిగారు. విద్యార్థులకు స్థానిక భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, ఆడియో పాఠాలను అందించేందుకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌లను తీసుకొచ్చారు. దీంతో మహారాష్ట్రలో క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టిన తొలి పాఠశాలగా డిసేల్ ఆధ్వర్యంలోని స్కూలు నిలిచింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలను ప్రవేశ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రకటించింది.