English | Telugu
జాతీయ పతాకంతో...ఆకాశంలో విహరించిన పక్షి
Updated : Aug 19, 2025
కరీంనగర్‌లో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమర్చిన జాతీయ జెండాను పట్టుకుని ఓ పక్షి పట్టుకొని ఆకాశంలో విహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. కరీంనగర్‌లో మానేరు డ్యాం గేట్ల పైనుండి పక్షి విహరించింది. ఈ వింతను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సన్నివేశాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.