English | Telugu

చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు

సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాదులో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నందు వేలాదిమంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహణతోపాటు 33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృతస్థాయి సమావేశం చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో TNGO భవన్ నాంపల్లి హైదరాబాద్ లో 206 భాగస్వామ్య సంఘాలు పాల్గొనగా ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ప్రధానంగా పెండింగ్ బిల్లుల మంజూరు, పిఆర్సి అమలు, పెండింగ్ డీఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దు తదితర 63 డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించారు..

సెప్టెంబర్ 8 నుండి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 8 న వరంగల్ జిల్లా
సెప్టెంబర్ 9 న కరీంనగర్ జిల్లా
సెప్టెంబర్ 10న ఆదిలాబాద్ జిల్లా
సెప్టెంబర్ 11న నిజాంబాద్ జిల్లా
సెప్టెంబర్ 12న సంగారెడ్డి మెదక్ జిల్లాలలో
సెప్టెంబర్ 15న వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో
సెప్టెంబర్ 16న మహబూబ్నగర్ జిల్లా
సెప్టెంబర్ 17న నల్లగొండ జిల్లా
సెప్టెంబర్ 18న ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో
సెప్టెంబర్ 19 నుండి మిగతా జిల్లాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.