English | Telugu
సర్వేపల్లిలో హోరెత్తిన రైతుల సంతోషం
Updated : Aug 19, 2025
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయం విడుదలైన సందర్భంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.వెంకటాచలం సమీపంలోని ఇసుక డంపింగ్ యార్డు వద్ద నుంచి ఎర్రగుంట టోల్ ప్లాజా దగ్గరలోని కమ్యూనిటీ హాలు వరకు ర్యాలీ సాగింది.
900 ట్రాక్టర్లతో రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. సంప్రదాయ పంచెకట్టుతో విజయోత్సవంలో ఉత్సాహంగా రైతులు పాల్గోన్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భాగస్వాములైరు