English | Telugu

వైఎస్‌లో ఉన్న గుణాలు జగన్‌లో లేవు.. రాజారెడ్డిలాంటివాడు జగన్‌ 

మా వాడు మా వాడు అంటూనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద విమర్శలు చేయడం టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి అలవాటు. తాజాగా మరోసారి జగన్‌పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన టీడీపీ సభలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ.. జగన్‌ ఎలాంటివాడో నేను గతంలోనే చెప్పా. జగన్‌ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా.మావాడి సంగతి మీకు తెలియదు.వైఎస్‌లో ఉన్న 10శాతం మంచిగుణాలు కూడా జగన్‌లో లేవు. అచ్చం రాజారెడ్డిలాంటివాడు జగన్‌ అంటూ వ్యాఖ్యానించారు జేసీ. ఆ సమయంలో వేదికపై చంద్రబాబు కూడా ఉన్నారు. ఇంకా జేసీ మాట్లాడుతూ.. చంద్రబాబులో కూడా మార్పు రావాలని అన్నారు. శాంతివచనాలతో సంకనాకించారని.. ఇప్పటికైనా బాబు శాంతివచనాలు పక్కనబెట్టాలని సూచించారు. గతంలో మన ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పినా వినలేదన్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేల కంటే మన ఎమ్మెల్యేలే 100 శాతం నయమని చెప్పుకొచ్చారు. చప్పట్లు కొట్టే వాళ్లను పట్టించుకోవద్దని జేసీ హితవు పలికారు.