English | Telugu

నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం.. త్వరలో ఉరి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌‌ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఉరిశిక్షపై పునఃసమీక్షించబోమని జస్టిస్ ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్, హత్య కేసులో తనకు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలంటూ అక్షయ్ పిటిషన్ దాఖలు చేశాడు. మంగళవారం ఈ కేసు విచారణ నుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే తప్పుకున్నారు. తన బంధువు ఒకరు ఈ కేసుని వాదించినందున తాను దీనిపై తీర్పు చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఆర్. భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఈ కేసుపై విచారణ చేపట్టింది. తీర్పు పునఃసమీక్షించబోమని స్పష్టం చేసింది. సుప్రీం నిర్ణయంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.