English | Telugu

శ్రీచైతన్య, నారాయణ క్యాంపస్‌లలో ఐటీ దాడులు

విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ శ్రీచైతన్య, నారాయణ క్యాంపస్‌లలో ఐటి శాఖ మెరుపు దాడి చేసింది.

విజ‌య‌వాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్‌లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం ఉద‌యం ఆక‌స్మికంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నారాయణ క్యాంపస్‌కు వెళ్లిన ఐటీ అధికారులు అక్కడి రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించి సోదాలు చేస్తున్నారు. తాటి గడప, ఈడ్పుగల్లులోని క్యాంపస్‌లలో కూడా దాడులు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్‌ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు.