English | Telugu
వందేళ్ళకొకసారి కొత్త వైరస్ పుడుతుందా?
Updated : Mar 4, 2020
ప్రతి వందేళ్లకు ఒకసారి ఏదో ఒక వైరస్ విజృంభించి లక్షల మందిని చంపేస్తుందా? ప్రస్తుతం కరోనా వైరస్ ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.
1720లో ప్లేగ్ మహమ్మారి బీభత్సం సృష్టించింది.
1820లో కలరా కల్లోలం రేపింది.
1920లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని విలవిలలాడేలా చేసింది.
2020లో కరోనా వైరస్ ఎలాంటి విలయతాండవం చేస్తుందోనని యావత్ ప్రపంచం వణికిపోతోంది.
గతంలో ప్లేగ్, కలరా, స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని గడగడలాడించాయి.
1720లో ఫ్రాన్స్ లోని మర్సైస్ లో ప్లేగ్ మొదట బయటపడింది. ఎలుకల నుంచి వచ్చిన ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.ఊర్లకు ఊర్లు ఊడ్చేసింది. లక్షల మంది చనిపోయారు. మరణించిన వారిని పూడ్చి పెట్టడం కష్టంగా మారి సామూహిక దహనాలు చేశారు.
1820లో కలరా(cholera) వ్యాధి బయటపడింది. మన దేశంలోని కోల్ కతా నగరంలో బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. తొలిసారి ప్రబలి యూరప్ వరకు వ్యాపించింది. ఆసియా, యూరప్ ఖండాలను వణికించింది. లక్షమందికి పైనే చనిపోయారు.
1920లో స్పానిష్ ఫ్లూ వైరస్ వచ్చింది. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడి కోటి మంది మరణించారు. ప్రపంచంలో అతి పెద్ద విషాదం మిగిల్చిన భయంకరమైన వ్యాధిగా స్పానిష్ ఫ్లూ చరిత్రకెక్కింది.
2020లో కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. ఇప్పటి వరకు 80 దేశాలకు వ్యాపించింది. 3 వేల మందికి పైగా ఈ వైరస్ కారణంగా చనిపోయారు. లక్షల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకెంతమందిని ఈ వైరస్ చంపుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు.