English | Telugu
మాజీ ఎంపీ హర్ష కుమార్ పై అక్రమ కేసు.. ఎస్సై వీడియో లీక్!!
Updated : Dec 30, 2019
మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యలు. పోలీస్ అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి చెప్పిన మాటలను, వీడియోను మీడీయాకు అందజేశారు హర్ష కుమార్ కుటుంబ సభ్యులు. తన పై ఒత్తడి తెచ్చి హర్ష కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని వీడియోలో పోలీస్ ఆఫీసర్ వివరిస్తున్నట్లుగా ఉంది. వైద్యులు వద్దంటున్న హర్ష కుమార్ ను బలవంతంగా జైలుకు తరలిస్తున్నారని ఆయన కుమారులు శ్రీరాజ్ సుందర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కనీసం లేవలేని స్థితిలో ఉన్న హర్ష కుమార్ ను జైలుకి ఎలా తీసుకువెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపిస్తున్నా కూడా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని అంటున్నారు. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
దీని పై స్పందించిన హర్ష కుమార్ కుమారుడు.. " మా నాన్నగారి పై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన ఎస్సై ఆయన దగ్గరకు వచ్చి..రెండు చేతులు పట్టుకుని చాలా తప్పు జరిగిపోయిందని చెప్పారన్నారు. ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి, ఒక పేద బడుగు బలహీన చిన్నస్థాయి మనుషుల గురించి పోరాడుతుంటే మీ పై కక్షసాధింపు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. మిమ్మల్ని ఇబ్బంది గురిచేయడానికి ఇలా అక్రమ కేసులు పెట్టడం తప్పని ఎస్సై చెప్పారు" అని వెల్లడించారు.