English | Telugu

బంగ్లాదేశ్ బాలికలతో వ్యభిచారం.. 21 మంది అమ్మాయిలకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి...

బంగ్లాదేశ్ నుంచి బాలికలను అక్రమంగా తీసుకువచ్చి మన దేశంలో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. బంగ్లాదేశ్ బాలికలను ఇండోర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. బంగ్లాదేశ్ బాలికలతో వ్యభిచారం సాగిస్తున్న 9మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని, 21 మంది బంగ్లాదేశ్ బాలికలను రక్షించామని సీఎం పేర్కొన్నారు.

బాలికలను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చి వారికి డ్రగ్స్ ఇచ్చి వారితో వ్యభిచారం చేయించారని సీఎం తెలిపారు. ఈ ముఠాలో నైజీరియా డ్రగ్ రాకెట్ పాత్ర కూడా ఉందని చెప్పారు. తమ రాష్ట్ర పోలీసు బృందం గుజరాత్ తోపాటు ఇతర రాష్ట్రాలను కూడా సందర్శించి దర్యాప్తు చేసిందని తెలిపారు. ఇండోర్ లో కొందరు జిమ్ ట్రైనర్స్ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని గుర్తించినట్లు చెప్పారు. జిమ్ ట్రైనర్స్ యువకులకు డ్రగ్స్ ను అలవాటు చేశారని సీఎం పేర్కొన్నారు.