English | Telugu
దారుణంగా పడిపోయిన క్రూడ్ అయిల్ ధర!
Updated : Mar 9, 2020
సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియడంతో అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతానికి పైగా చమురు ధరలు పడిపోయాయి. 1991లో గల్ఫ్ యుద్ధం తర్వాత ఒకరోజులో ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం ఇదే తొలిసారి. తమ దేశంలో చమురు ఉత్పత్తి పెంచి.. తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించాలని రియాద్ తీవ్ర ధరల పోరుకు సిద్ధమవడంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ ముడి చమురు అత్యల్పంగా 31.02డాలర్ల స్థాయికి పడిపోయింది.
ఎక్కువ మార్కెట్‌ను హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో సౌధీ క్రూడ్ ఆయిల్ ధరలను భారీగా తగ్గిస్తోంది. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజీల్ రేట్లు భారీగా పడిపోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ అయిల్ ధరలు ఒక్క రోజులోనే 25శాతం పడిపోవటంతో. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్‌పై పడనుంది. అయితే, ఈ ప్రభావం భారత్‌పై భారీగా ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్ కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, ఇరాన్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడి ఉందని. అయితే, సౌధీ అరెబియా రేట్ల తగ్గింపు ఇతర దేశాలపై ఉంటుంది కాబట్టి. భారత్‌లో ప్రభావం కాస్త తక్కువైనా ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు అభప్రాయపడుతున్నారు.
చమురు ధర బ్యారల్‌కు 43 డాలర్ల కన్నా తగ్గితే రష్యా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగ దేశాలైన భారత్, చైనాలకు ఇది ఆయిల్ బొనాంజా అని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే నెల నుంచి 10 మిలియన్ బ్యారల్‌కు పైగా ముడిచమురును ఉత్పత్తి చేయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఇది ఈ రెండు దేశాలకు ఉపయోగకరమని భావిస్తున్నారు.
ముడి చమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలడానికి రష్యా-సౌధీ అరెబియా కారణమం. ఇంధన ఉత్పత్తి విషయంలో ఈ రెండు దేశాల మధ్య వివాదం తలెత్తటంతో. సౌధీ క్రూడ్ ఆయిల్ ధరలను భారీగా తగ్గించింది. అంతేకాదు రాబోయే రోజుల్లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని కూడా మరింత పెంచనుందని. ఇవన్నీ కలిపి అంతర్జాతీయంగా రేట్లు దిగివస్తాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.