English | Telugu
ఆ దారుణ ఘటన కారణంగానే ఐపీఎల్ కు దూరమయ్యా.. సురేష్ రైనా క్లారిటీ
Updated : Sep 1, 2020
"పంజాబ్‌లోని తమ బంధువులు ఒక భయంకర ఘటనను ఎదుర్కొన్నారని ఆ ఘటనలో తన అంకుల్‌ని కొంత మంది నరికి చంపేశారని రైనా తెలిపారు. ఈ ఘటనలో తమ ఆంటీతో పాటు మరో ఇద్దరు కజిన్‌లకు తీవ్రగాయాలయ్యాయని వారంతా ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతుండగా.. దురదృష్టవశాత్తు తన కజిన్ గత రాత్రి మృతి చెందాడని. అలాగే తన ఆంటీ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది" అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ ఘటనకు కారకులెవరో, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పటివరకు ఎవరికీ స్పష్టంగా తెలియదని.. ఈ మొత్తం ఘటనపై దృష్టిసారించాలని అయన పంజాబ్ పోలీసులను కోరుతున్నానన్నారు. "ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారు తప్పించుకుని, మరో నేరం చేయడానికి వీల్లేదు" అంటూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు సురేశ్ రైనా తాజాగా ట్వీట్ చేశారు.