English | Telugu

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉంది.. హైకోర్టులో సిబిఐ

ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు లేవని ఆందోళన వ్యక్తం చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు పలు మలుపులు తిరిగి చివరికి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా సిబిఐ డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని ఐతే దీని పై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈ రోజు హైకోర్టుకు నివేదించింది. దీని కోసం తమకు మరో నెల సమయం ఇవ్వాలని సిబిఐ అభ్యర్ధించింది. దీనిపై సిబిఐ వాదనలు విన్న హైకోర్టు నవంబర్ 11 వరకు దీనిపై పూర్తి రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా మాస్కులు అడిగిన పాపానికి తన బిడ్డను పిచ్చివాడిగా ముద్రవేసి హాస్పిటల్ లో జాయిన్ చేసారని ఆయన తల్లి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.