English | Telugu
ప్రపంచ అనారోగ్య సంస్థ కబంధ హస్తాల నుంచి విముక్తి ఎపుడో..
Updated : Sep 7, 2020
ప్రపంచ అనారోగ్య సంస్థ సూచనల్ని బేఖాతరు చేసిన స్వీడన్ , థాయిలాండ్, వియత్నాం లాంటి అనేక దేశాలు కరోనా పై నూటికి నూరు శాతం విజయం సాధించాయి. మాస్క్ లు , భౌతిక దూరం లాంటివి ఇప్పుడు అక్కడ అవసరం లేకుండా పోయింది. అన్నట్టు మన దాయాది దేశం పాకిస్థాన్ లో నిన్న నమోదైన కొత్త కేసులు 500 లోపే.. నిబంధనలు పాటించకుండా వారు చేసిన రంజాన్ షాపింగ్ పుణ్యమా అని వారికి హెర్డ్ ఇమ్మ్యూనిటి త్వరగా వచ్చేసింది.
సెప్టెంబర్ ఇరవై తరువాత కొత్త గా కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అయ్యే ఏకైక దేశంగా ఇండియా మిగిలిపోతుంది అనడంతో ఏ మాత్రం సందేహం కనిపించడం లేదు. ఆదివారం ఒకరోజే 91వేలకు పైగా కేసులు నమోదు కాగా.. నేడో, రేపో కొత్త కేసుల సంఖ్య లక్షను చేరుతుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలో రోజూ లక్ష కొత్త కేసులు నమోదు అయిన దేశంగా రికార్డు సృష్టించబోతున్నది భారతదేశం. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంతగా పెరగడానికి, ఇది రావణ కాష్టంలా సాగడానికి ప్రధాన కారణం మనలో చాల మంది ప్రపంచ అనారోగ్య సంస్థ(మన పాలిట అనారోగ్య సంస్థే) మాటల్ని విపరీతమైన భక్తి తో పాటించడమే ! కోవిడ్ 19 వైరస్ కేసులు నమోదు అయిన తొలి రోజుల నుంచి ఇప్పటివరకు ప్రపంచ అనారోగ్య సంస్థ చేసిన ప్రకటనలు చూస్తే ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్నది మనం స్పష్టంగా తెలుసుకోలేని అయోమయపరిస్థితి. ఇంటి నుంచి కాలు బయట పెడితే కరోనా వైరస్ సోకుతుంది, ఒకసారి వైరస్ శరీరంలోకి వచ్చిందంటే మరణమే శరణమని నమ్ముతున్నాం. ప్రాణాలు తీసే కరోనా బారిన పడకుండా నాలుగుగోడల మధ్య బందీగా మారారు. ప్రపంచ అనారోగ్య సంస్థ చెప్పే ప్రతి మాటను మూఢభక్తి తో నమ్ముతున్న ప్రజలున్న ఏకైక దేశం మనదే! భయం తో ఉన్న వారినే చూసి కాటెయ్యడం కరోనా ప్రపంచ వ్యాప్తంగా చూపిన లక్షణం.
కోటి జనాభా ఉన్న స్వీడన్ "నేను హెర్డ్ ఇమ్మ్యూనిటి మార్గంలో వెళుతాను.. ప్రకృతి సిద్ధమైన రోగనిరోధక శక్తినే నమ్ముకొంటాను .. ప్రపంచ అనారోగ్య సంస్థ సైన్స్ పేరుతొ చెబుతున్న బూటకపు మాటల్ని కాదు" అని ముందుకు వెళ్ళింది. ఆ దేశంలో అతి తక్కువ కేసులు నమోదు కావడంతో పాటు ఇప్పటివరకు కేవలం అయిదు వేల మరణాలతో కరోనా పై నూటికి నూరు శాతం విజయం సాధించింది.
కళ్ళుండీ చూడలేని మనుషులున్న ప్రపంచం మనది. అంతరీక్షంలోకి మరో దశాబ్దాలంలో మనుషులు వెళ్లగలిగేంత అభివృద్ధిని సాధిస్తున్నాం. మరోవైపు సైన్స్ పేరుతో మధ్య యుగం నాటి మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. కరోనా ఎలా వస్తుందో, ఎందుకు వస్తోందో స్పష్టంగా చెప్పలేకపోయినా ప్రపంచ అనారోగ్య సంస్థ చెబుతున్న విషయాలను మనం గుడ్డిగా నమ్మాల్సిందే. కాదని ఎవరైనా ప్రశ్నించినా సరైన సమాధానం ఆ సంస్థ వద్ద లేదు. అందుకే వింతవింత కారణాలు, పొంతనలేని విషయాలు చెప్పుతూ నాటకాలు ఆడుతున్నది ప్రపంచ అనారోగ్య సంస్థ. జీవితాలను బందీ చేస్తున్న ఈ సంస్థ కబంద హస్తాల నుంచి మనకు విముక్తి ఎప్పుడో?