English | Telugu
కల్నల్ సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
Updated : Jul 22, 2020
దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు మృతికి తీవ్ర సంతాపం తెలపడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఐదుకోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి కెసీఆర్ సూర్యాపేటలోని ఆయన ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఆయన భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్ లో ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం సంతోషి ప్రగతి భవన్ లో సిఎంను కలిశారు. ఆమెను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు అందించారు. ఉద్యోగ నిర్వహణకు అవసరమైన సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సూచించారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మద్యాహ్న భోజనం చేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.