English | Telugu
వెలగపూడి ఘర్షణలో మహిళ మృతి.. ఎంపీ నందిగం సురేష్ పై ఆరోపణలు
Updated : Dec 28, 2020
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో ఆర్చి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదం గత రెండు మూడు రోజులుగా కొనసాగుతోంది. ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మించి.. జగజ్జీవన్‌రామ్ కాలనీగా పేరు పెట్టాలని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ నిర్ణయంపై మరొక వర్గం తీవ్ర అభ్యరంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ ఘర్షణలో ఎంపీ నందిగం సురేష్ హస్తం ఉన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయన రెండు దళిత వర్గాల మధ్య ఘర్షణను ప్రొత్సహించారని వారు ఆరోపణలు చేస్తున్నారు. తాజా ఘర్షణ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు.