English | Telugu

బ్రేకింగ్.. చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాదుకు రోడ్డు మార్గంలో వస్తుండగా.. ఆయన కాన్వాయ్‌ లోని వాహనానికి ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాన్వాయ్ కి ఓ ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ లో ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉన్నారు. ఈ ప్రమాదంలో చంద్రబాబు సహా, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటన అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాదు వైపు కదిలింది.