English | Telugu
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థితో మంత్రి లోకేష్ భేటీ
Updated : Aug 18, 2025
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన్ను భేటీ అయ్యారు.
మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్తతరానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తన పరిచయాన్ని లోకేశ్‌తో సీపీ రాధాకృష్ణన్ పంచుకున్నారు. ఈనెల 20వ తేదీన ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు, ఉభయ సభల పక్ష నేతలు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు.