English | Telugu

ఆకతాయిలు జాగ్రత్త... దిశా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

రాజమండ్రిలో తొలి దిశా మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. మహిళలకు బాలికలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించటానికి.. పటిష్ఠ భద్రత కల్పించటానికి తక్షణ సాయం చేయడానికి దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసేంది ఏపీ సర్కార్. అందులో భాగంగానే తొలి దశ పోలీసు స్టేషన్ ను కొద్ది సేపటి క్రితం ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు రక్షణకు దిశా మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు.ఈ పోలీస్ స్టేషన్ల ద్వారా మహిళలకు సత్వర రక్షణ భద్రత ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. మహిళలు చిన్నారుల పై లైంగిక దాడులు ,వేధింపుల కేసులో ఐపీసీ 354 ఎఫ్, 354 జీ సెక్షన్స్ ను అదనంగా చేర్చారు. ఈ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైతే ఏడు రోజుల్లో దర్యాప్తు చేస్తారు. 14 పని రోజుల్లో విచారణను పూర్తి చేస్తారు. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.

అదే విధంగా దర్యాప్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశా కోర్టులు ఉంటాయి. ఇందుకోసం 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను నియమిస్తున్నారు. రేప్ లకు , గ్యాంగ్ రేప్ లకు పాల్పడితే గనక ఉరిశిక్ష విధిస్తారు. అదే విధంగా చిన్నారుల పై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు ఉంటుంది. సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ మహిళలను వేధిస్తే మొదటిసారైతే రెండేళ్లు జైలు శిక్ష , అదే తప్పు రెండోసారి రిపీట్ చేస్తే నాలుగేళ్ల జైలు శిక్షను విధించబోతున్నారు. అదే విధంగా అత్యాచారం కేసులో శిక్ష పడ్డ దోషుల అప్పీలు చేసుకోవడానికి గడువును 180 రోజుల నుంచి 45 రోజులకు కుదించడం జరిగింది.