English | Telugu

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు అసెంబ్లీ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. శాసన సభ సమావేశాల నిర్వహణపై సభాపతి అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమవుతుంది.ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ నిర్ణయం తీసుకోనున్నారు.