English | Telugu

చైనా కంటే ముందుగానే అమెరికాలో కరోనా.. యూఎస్ సీడీసీ వెల్లడి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చైనా నుండి వ్యాప్తి చెందిందని ఇప్పటివరకు అందరు నమ్ముతూ వస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇచ్చిన తాజా రిపోర్టు దీనికి బిన్నంగా ఉంది. సీడీసీ విడుదల చేసిన రిపోర్ట్ లో.. అమెరికాలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది డిసెంబరు మధ్యలోనే కరోనా మహమ్మారి అమెరికాలో వ్యాప్తి చెందిందని ఆ రిపోర్టు లో పేర్కొంది. అయితే చైనా మాత్రం జనవరిలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి అధికారికంగా ప్రకటన చేసింది.

అయితే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్‌కు చైనానే కారణమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. అయితే సీడీసీ తెలిపిన ఈ వివరాలతో చైనా, అమెరికా ల మధ్య దీనిపై మరో వివాదం చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీడీసీ చేసిన ఈ అధ్యయనం కోసం రెడ్‌క్రాస్ సాయంతో 7,389 మంది రక్త దాతల బ్లడ్ శాంపిల్స్ సేకరించి, వాటిపై పలు పరిశోధనలు నిర్వహించింది. ఈ శాంపిల్స్‌లోని 106 నమూనాలలో కరోనా వైరస్ కనుగొన్నారు.