English | Telugu

ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలు మూత పడిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవతాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు 31వ తేదీ నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనుల పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

అయితే, ఏపీలో రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో సీఎం చెప్పినట్టు సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభమవ్వడం సాధ్యమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రారంభమైనా, కరోనా భయంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను పాఠశాలలకు పంపేందుకు వెనకడుగు వేసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.