English | Telugu

టీడీపీ నేత అచ్చెన్న కేసులో అర్ధరాత్రి హైడ్రామా

ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను ఎసిబి కస్టడీకి అప్పగిస్తూ ఎసిబి కోర్ట్ నిన్న సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. ఐతే తనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకునేందుకు అనుమతించాలని అచ్చెన్న చేసిన అభ్యర్ధనను మాత్రం కోర్టు తిరస్కరించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఆస్పత్రిలోనే ఉంచి న్యాయవాది, వైద్యుడి సమక్షంలో విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయనను కూర్చోమని లేదా నిలబడమని అధికారులు కోరడానికి వీల్లేదని ఆ ఆదేశంలో స్పష్టం చేసారు.

అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో సీన్ మొత్తం మారిపోయింది. అర్ధరాత్రి సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్‌ అధికారులు హైడ్రామాకు తెర తీసారు. అంతకు ముందు కోర్టుకు అందించిన రిపోర్ట్ లో ఆయనను మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. దీంతో ఆయనను తమ అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి అటు అయన తరుఫు లాయర్, ఇటు టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో అచ్చెన్న డిశ్చార్జి పై ఆస్పత్రి అధికారులు వెనక్కి తగ్గారు.