English | Telugu
శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది మృతి
Updated : Aug 21, 2020
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్ కో అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయంలో 17 మంది ఉద్యోగులు ప్లాంట్‌లో ఉన్నారు. 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు.
మృతుల వివరాలు:
- డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్)
- ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ)
- ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ )
- ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్)
- ఏఈ సుందర్ (సూర్యాపేట)
- ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా)
- జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ)
- హైదరాబాద్‌కు చెందిన అమర్ రాజా బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్