English | Telugu

8 నెలల చిన్నారికి కరోనా ! దేశంలో మృతుల సంఖ్య 20!

సౌదీ అరేబియా నుంచి ఇటీవలే శ్రీనగర్ కు తిరిగివచ్చిన‌ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.
ఈ ఇద్దరు పిల్లలలో ఒకరు 8 నెలల చిన్నారి. మరొకరు ఏడు సంవత్సరాల వయస్సు గల అమ్మాయి. ఈ చిన్నారులు క‌రోనా పాజిటివ్ గా వున్న వ్యక్తి కి మనవళ్ళు.

రెండు తాజా కేసులతో జమ్ము కశ్మీర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 733 పెరిగింది. ఇప్ప‌ట్టి వ‌ర‌కు మృతుల సంఖ్య 20. ప్రపంచ వ్యాప్తంగా 532263 మంది కరోనా భారిన పడగా 24090 మంది కరోనా వైరస్ తో మృతి చెందారు.