English | Telugu
గర్భిణీలకు కరోనా టెస్టు తప్పనిసరి!
Updated : Mar 27, 2020
బరువు, హార్ట్ బీట్ అన్నీ సరిగ్గానే ఉన్నా కరోనా వైరస్ శిశువుకు సోకిందని డాక్టర్లు చెబుతున్నారు. 'పుట్టిన వెంటనే రక్తనమూనాలను సేకరించి బ్లడ్ టెస్టులు చేశాం. పాపకు కరోనా పాజిటివ్ వచ్చింది' అని వైద్యులు అంటున్నారు.
చైనాలో మరో 33మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ప్రసవం తర్వాత రెండ్రోజుల వరకూ టెస్టులు చేయకపోవడంతో యాంటీ డోసుల వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. కొందరు రీసెర్చర్లు తల్లికి ఉన్న కరోనా పాపకు కచ్చితంగా వచ్చి తీరుతుందని దానిని తప్పించలేమని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సమయంలో గర్భిణీలు ప్రసవానికి సిద్ధమవుతుంటే కరోనా టెస్టు కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే.