English | Telugu
రూపాయి చెల్లించకుండానే 6 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్!
Updated : Mar 4, 2020
మీకు PF అకౌంట్ వుందా? అయితే ప్రీమియం చెల్లించకుండానే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. ఎలా అంటే ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లకు మూడు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ అనేవి ఇవి. తొలి రెండూ అంటే ఈపీఎఫ్, ఈపీఎస్ అనేవి సేవింగ్స్ స్కీమ్స్. ఇక ఈడీఎల్ఐ (ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్) అనేది ఇన్సూరెన్స్ స్కీమ్.
ఈడీఎల్ఐ స్కీమ్ 1976 నుంచి అమలులో ఉంది. ఉద్యోగులకు ఈపీఎఫ్ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి కంపెనీకి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల ఉద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.
సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే ఈ ఈపీఎఫ్‌వో స్కీమ్ నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి.
ఈడీఎల్ఐ స్కీమ్‌లో ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ ఈపీఎస్ సేవింగ్స్ స్కీమ్స్‌తో లింక్ అయ్యి ఈ పథకంప నిచేస్తుంది. అంటే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు అందరికీ ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది. ఆటోమేటిక్‌గానే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయి.
కంపెనీ ఈ స్కీమ్‌కు ఉద్యోగి తరుపున కంట్రిబ్యూషన్ చేస్తుంది. డీఏ, శాలరీ ప్రాతిపదికన కంట్రిబ్యూట్ మొత్తం డిసైడ్ అవుతుంది. కంపెనీ గరిష్టంగా 0.50 శాతం లేదా రూ.75లను ఈడీఎల్‌ఐ స్కీమ్‌కు ఉద్యోగి తరుపున కంట్రిబ్యూట్ చేస్తుంది.
ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి మరణం తర్వాత నామినీకి శాలరీకి 30 రెట్లు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఇక్కడ శాలరీ అంటే కేవలం డీఏ, బేసిక్ శాలరీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు అదనంగా రూ.1.5 లక్షల బోనస్ కూడా అందజేస్తారు. ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే మరణిస్తే.. నామినీకి గరిష్టంగా రూ.6 లక్షల వరకు లభిస్తాయి.
ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్‌గా కొనసాగుతున్నారు. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ స్కీమ్స్‌లో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగి డ్యూటీలో మరణించారు. ఈ ఉద్యోగి నెలవారీ జీతం రూ.15,000గా ఉంది. ఇప్పుడు ఉద్యోగి నామినీ ఈడీఎల్ఐ క్లెయిమ్ కోసం అప్లై చేసుకున్నారు. నామినీకి రూ.6 లక్షలతొ నాటె లక్షా 50 వేల రూపాయల బోనస్ వస్తుంది.
ఈపీఎఫ్‌వో చట్టం కింద రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీకి ఇది వర్తిస్తుంది. ఈ కంపెనీలు ఈ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉద్యోగులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్‌ను అందించాల్సి ఉంటుంది.