English | Telugu
ఐదేళ్ల చిన్నారి పై దారుణానికి పాల్పడ్డ దుండుగులు...
Updated : Nov 8, 2019
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికొచ్చిన ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. బి కొత్తకోట మండలం గట్టు గ్రామ పంచాయతీలోని గుట్ట పాలెం గ్రామానికి చెందిన ఉషారాణి, సిద్దారెడ్డి దంపతులు తమ ఐదేళ్ల కుమార్తె వర్షితను తీసుకుని అంగళ్లలో బంధువుల పెళ్లికి వెళ్లారు. పెళ్లికి వెళ్లిన తరువాత వర్షిత కనిపించకుండా పోయింది. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేసిన తరువాత లైంగిక దాడి చేసి చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు. వర్షితను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి. పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్ల చిన్నారి హర్షిత పెళ్లిలో ఆడుకుంటూ ఉండగా ఒక యువకుడు ఆ పాపను తీసుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఆ పాపను అత్యాచారం చేసి చంపేసినట్టుగా వెల్లడైయ్యింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉత్సాహంగా ఉన్నటువంటి పాప తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఒక యువకుడు ఫొటో తీస్తా అంటూ తీసుకు వెళ్ళినట్టుగా వెల్లడించారు తల్లిదండ్రులు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పాప కోసం వెతికారు. రాత్రి అంతా కళ్యాణ మండపంతో పాటు సమీప ప్రాతంలో ఎంత వెతికినా కూడా పాప కనిపించకపోవడంతో ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపానికి సమీపంలోనే ఈ చిన్నారి మృతి చెందిందన్న వార్త పెళ్ళికి వచ్చిన బంధువుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లీదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న పాప మృతిదేహం దగ్గరకు వెళ్ళి కన్నీటి పర్యాంతం అయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు అధికారులు వీలైనంత త్వరలో ఆ కామాంధుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.