English | Telugu

సౌదీలో ఇండియ‌న్ క‌రోనా మృతులు 11

సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు కరోనా కోవిడ్‌-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయం వద్ద ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు 11 మంది భారతీయులు కోవిడ్ తో మరణించారు.ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి.
మరణించిన వారి వివరాలు...మదీనా--4, మక్కా--3, జెడ్డా--2,
రియాద్‌--1, ధమ్మామ్--1.

లాక్ డౌన్ కారణంగా భారత్ కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.