English | Telugu
రష్యా వ్యాక్సిన్ తో కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ ఊహించినవే
Updated : Sep 17, 2020
ఇది ఇలా ఉండగా తమ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా త్వరలో ప్రారంభవుతాయని రష్యా ఈమధ్య ప్రకటించింది . దాదాపు 40 వేల మందికి ఈ టీకా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో రష్యా ఇప్పటికే 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వగా మరో డోసు 21 రోజుల తరువాత ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్ల కోసం ఒక యాప్‌ను రూపొందించారు. ఒక వేళ ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆ యాప్ ద్వారా తెలియజేయాలని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కోసం 55 వేల మంది వాలంటీర్లు ముందుకు రాగా వీరిలో 40 వేల మందిని ఎంపిక చేసి వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ మూడో దశ ట్రయల్స్ ఫలితాలు అక్టోబర్ నవంబర్ మధ్య వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకపక్క మూడో దశ ట్రయల్స్ జరుగుతుండగానే రష్యాలో ప్రజలందరికి నవంబర్ చివరి నుండి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.