English | Telugu

వ‌న్స్ మోర్.. `తొలిప్రేమ‌` పెయిర్!?

2018లో విడుద‌లైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ `తొలిప్రేమ‌`లో జంట‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అందాల తార రాశీ ఖ‌న్నా. ఆపై మ‌ళ్ళీ జ‌త‌క‌ట్టిన ఈ ఇద్ద‌రు.. త్వ‌ర‌లో మ‌రోమారు ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి రెడీ అవుతున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `గ‌రుడ వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ తేజ్ కెరీర్ లో 12వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ప్ర‌ముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించనున్నారు. లండ‌న్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో `వాన‌`, `డిటెక్టివ్`, `డాక్ట‌ర్` ఫేమ్ విన‌య్ రాయ్ విల‌న్ రోల్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. కాగా, ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ కి జంట‌గా రాశీ ఖ‌న్నాని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. క‌థ‌, పాత్ర న‌చ్చ‌డంతో రాశి కూడా ఈ సినిమాలో న‌టించేందుకు ఆసక్తి చూపిస్తోంద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే వ‌రుణ్ - ప్ర‌వీణ్ కాంబో మూవీలో రాశీ ఖ‌న్నా ఎంట్రీపై క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే, వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం `ఎఫ్ 3` ఈ నెల 27న రిలీజ్ కానుండ‌గా.. రాశి త‌దుప‌రి తెలుగు చిత్రాలు `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`, `థాంక్ యూ` జూలై ప్ర‌థ‌మార్ధంలో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నాయి.