English | Telugu

వ‌న్స్ మోర్.. అఖిల్, భాస్క‌ర్ కాంబినేష‌న్!?

`అఖిల్`, `హ‌లో`, `మిస్ట‌ర్ మ‌జ్ను`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`.. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సినిమాల‌తో క‌థానాయ‌కుడిగా ప‌ల‌క‌రించాడు అక్కినేని బుల్లోడు అఖిల్. వీటిలో తొలి మూడు చిత్రాలు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోగా.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` మాత్రం స‌క్సెస్ బాట ప‌ట్టింది. కాగా, అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్` అనే స్పై థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ఆగ‌స్టు 12న తెర‌పైకి రాబోతోంది. ఈలోపు.. `హ‌నుమాన్ జంక్ష‌న్` ఫేమ్ మోహ‌న్ రాజాతో అఖిల్ ఓ మూవీని ప‌ట్టాలెక్కించే దిశ‌గా స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` రూపంలో హీరోగా త‌న‌కి ఫ‌స్ట్ హిట్ ని ఇచ్చిన `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ట అఖిల్. ఇప్ప‌టికే ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని స‌మాచారం. అంతేకాదు.. ఆసియ‌న్ మూవీస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంద‌ని చెప్పుకుంటున్నారు. త్వ‌ర‌లోనే అఖిల్, భాస్క‌ర్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది. మ‌రి.. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడితోనూ రెండో సినిమా చేయ‌ని అఖిల్.. భాస్క‌ర్ కాంబోలో సెకండ్ టైమ్ కూడా మెస్మ‌రైజ్ చేస్తాడేమో చూడాలి.