Read more!

English | Telugu

వర్మ 12 సినిమాలతో ఎటాక్ చేస్తాడా...?

 

రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే ఆయన త్వరలోనే మరో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడట. 12 నెలల్లో 12 సినిమాలు తీయాలని వర్మ డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం మోహన్ బాబుతో "రౌడీ", రాజశేఖర్ తో "పట్టపగలు" వంటి చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఇవి విడుదల కాబోతున్నాయి. అంటే నెలకో సినిమా తీసేసి జనాల మీదకు వదిలేస్తే.. అయితే హిట్టు, లేదా ఫట్టు అనే ఆలోచనలో వర్మ ఉన్నట్లుగా అనిపిస్తుంది. మరి వర్మ ఆలోచనలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.