English | Telugu

'పైసా వసూల్' కాంబో.. పూరి దర్శకత్వంలో బాలయ్య!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు బాలయ్య. అయితే అనిల్ ప్రాజెక్ట్ అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

ఇటీవల పూరి డైరెక్ట్ చేసిన 'లైగర్' భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయం పాలైంది. దీంతో పూరి చేయాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'జన గణ మన' పక్కకెళ్ళిపోయింది. ప్రస్తుతం తనయుడు ఆకాష్ పూరితో ఓ మూవీ ప్లాన్ చేస్తున్న పూరి.. ఆ తర్వాత బాలయ్యతో మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

గతంలో పూరి, బాలయ్య కాంబోలో 'పైసా వసూల్'(2017) అనే సినిమా వచ్చింది. రిజల్ట్ ఎలా ఉన్నా ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. బాలయ్య డైలాగ్ డెలివరీ, బాడీ ల్యాంగ్వేజ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మూవీ టైంలో పూరి వర్కింగ్ స్టైల్ బాలయ్యకి నచ్చింది, అలాగే బాలయ్యతో ఎప్పుడైనా వర్క్ చేయడానికి రెడీ అని పూరి ఆ సమయంలో చెప్పాడు. ఇక తాజాగా పూరి ఓ స్టొరీ లైన్ తో బాలయ్యను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని సమాచారం.