English | Telugu

'ఎన్టీఆర్ 30'లో 'ప్రాజెక్ట్ కె' భామ‌లు!

`జ‌న‌తా గ్యారేజ్` (2016) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ - విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మ‌రోమారు జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ క్రేజీ వెంచ‌ర్ కి స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నుండ‌గా.. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ళ‌నుంది.

ఇదిలా ఉంటే, `ఎన్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముంద‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ `ప్రాజెక్ట్ కె`లో హీరోయిన్లుగా న‌టిస్తున్న బాలీవుడ్ బ్యూటీస్ దీపికా ప‌దుకోణే, దిశా ప‌టాని.. `ఎన్టీఆర్ 30`లోనూ సంద‌డి చేసే అవ‌కాశ‌ముంద‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, 2023 వేస‌విలో `ఎన్టీఆర్ 30` జ‌నం ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.