English | Telugu

మరో సినిమాకి ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్..!

మరో సినిమాకి ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్..!

 

పవన్ కళ్యాణ్ త్వరలో 'హరి హర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన పవన్.. తన తదుపరి చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూడు సినిమాల తర్వాత ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేయరని.. పూర్తిగా పాలిటిక్స్ కే పరిమితమవుతారని భావించారంతా. కానీ, అనూహ్యంగా ఆయన మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Pawan Kalyan)

 

సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో వీరి కలయికలో 'బ్రో' అనే సినిమా వచ్చింది. ఇందులో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ నటించగా.. రచనలో త్రివిక్రమ్ భాగమయ్యారు. 'బ్రో' కోసం పవన్ తక్కువ రోజులే కేటాయించినప్పటికీ.. ఈ సినిమా అభిమానులను బాగానే అలరించింది. ఈ క్రమంలోనే వేగంగా పూర్తయ్యేలా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు.