English | Telugu

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇవ్వబోతున్నారా?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వరల్డ్‌వైడ్‌గా 275 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసి పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లోనే ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. చాలా కాలం తర్వాత పవన్‌ కళ్యాణ్‌కి సరైన సినిమా వచ్చిందని ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత పవర్‌స్టార్‌ నుంచి రాబోతున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఇటీవలికాలంలో వచ్చిన పవన్‌కళ్యాణ్‌ సినిమాలు టైటిల్‌ నుంచే వెరైటీగా ఉంటున్నాయి. అలాంటి ఓ విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘ఓజీ’ సందడి కొనసాగుతుండగానే ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’కి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌కి తన అభిమాన హీరో పవన్‌కళ్యాణ్‌ని ఎలా చూపించాలో బాగా తెలుసు. కెరీర్‌ పరంగా పవన్‌ కాస్త వెనకబడి ఉన్న సమయంలోనే ‘గబ్బర్‌సింగ్‌’తో బ్లాక్‌బస్టర్‌ అందించాడు హరీష్‌. తాజాగా వచ్చిన ‘ఓజీ’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన సుజిత్‌ కూడా పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని. తమ అభిమాన హీరోని స్క్రీన్‌పై ఎలా చూడాలనుకుంటున్నారో ఫ్యాన్స్‌కి మాత్రమే తెలుస్తుందని ఈ ఇద్దరు డైరెక్టర్లు ప్రూవ్‌ చేశారు. ఓజీ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్‌ అందించేందుకు హరీష్‌ శంకర్‌ కూడా రెడీ అవుతున్నాడు. ‘గబ్బర్‌సింగ్‌’కి పూర్తి భిన్నంగా ఉండే ఒక మాస్‌ క్యారెక్టర్‌లో పవన్‌కళ్యాణ్‌ను చూపించబోతున్నాడు హరీష్‌ శంకర్‌.

ఇప్పటికే విడుదలైన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఫస్ట్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఎట్రాక్ట్‌ చేసింది. అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చెయ్యబోతున్నారని తెలుస్తోంది. అక్టోబర్‌ 20న దీపావళి సందర్భంగా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమా రిలీజ్‌ ఉంటుంది. పవన్‌కళ్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబనేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ క్యారెక్టర్‌ను ఒక రేంజ్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. పవన్‌ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేసే దీపావళి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.