English | Telugu

తార‌క్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా `ఎన్టీఆర్ 30`!?

`టెంప‌ర్` (2015), `నాన్న‌కు ప్రేమ‌తో` (2016), `జ‌న‌తా గ్యారేజ్` (2016), `జై ల‌వ కుశ‌` (2017), `అర‌వింద స‌మేత‌` (2018), `ఆర్ ఆర్ ఆర్` (2022).. ఇలా ఆరు వ‌రుస `నాన్ - ఫెయిల్యూర్స్`తో డ‌బుల్ హ్యాట్రిక్ అందుకున్నారు యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్. ఈ నేప‌థ్యంలో తార‌క్ త‌దుప‌రి చిత్రంపై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొని ఉంది. విజ‌న‌రీ కెప్టెన్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో `జ‌న‌తా గ్యారేజ్` త‌రువాత చేయ‌బోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. నెవ‌ర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు ఎన్టీఆర్.

`ఎన్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. యంగ్ టైగ‌ర్ బ‌ర్త్ డే (మే 20) స్పెష‌ల్ గా 2023 మే 19న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. తార‌క్ అభిమానుల‌కు ఇది ఆనందాన్నిచ్చే అంశ‌మ‌నే చెప్పాలి. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానున్న‌ది. కాగా, పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా వినోదాలు పంచ‌నున్న‌ `ఎన్టీఆర్ 30`కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు.