English | Telugu

బాల‌య్య చిత్రానికి రిలీజ్ డేట్ అదేనా!?

గ‌త చిత్రం `అఖండ‌` (2021)తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప్ర‌స్తుతం ఈ టాప్ హీరో.. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంలో బాల‌య్య‌కి జోడీగా చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే, బాల‌య్య - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ మూవీని విజ‌య ద‌శ‌మి కానుక‌గా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ద‌స‌రా రోజు అంటే అక్టోబ‌ర్ 5న ఈ యాక్ష‌న్ డ్రామాని జ‌నం ముందుకు తీసుకువ‌చ్చే దిశ‌గా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని చెప్పుకుంటున్నారు. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

కాగా, గోపీచంద్ మ‌లినేని డైరెక్టోరియ‌ల్ పూర్త‌య్యాక వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు న‌ట‌సింహం.