English | Telugu

నాగ్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్!

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు తో `శ్రీ‌మంతుడు`, `స‌ర్కారు వారి పాట‌`.. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో `జ‌న‌తా గ్యారేజ్`.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో `రంగ‌స్థ‌లం`.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప - ద రైజ్` చిత్రాల‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌.. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్ లో `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` ఫిల్మ్ ప్లాన్ చేసింది. అదే విధంగా, విక్ట‌రీ వెంక‌టేశ్ తోనూ ఓ మూవీ నిర్మించ‌నుంది.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. చిరు, బాల‌య్య‌, వెంకీ త‌రువాత మ‌రో సీనియ‌ర్ స్టార్ అయిన‌ కింగ్ నాగార్జున‌తోనూ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని నిర్మించ‌నుంద‌ట‌. అంతేకాదు.. ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కాంబినేష‌న్ లో ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మ‌రి.. నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య తో మైత్రీ నిర్మించిన `స‌వ్య‌సాచి` ఆశించిన విజ‌యం సాధించ‌ని నేప‌థ్యంలో.. నాగ్ కాంబో మూవీ అయినా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.

ఇదిలా ఉంటే, నాగార్జున ఓ స్పెష‌ల్ రోల్ లో న‌టించిన హిందీ చిత్రం `బ్ర‌హ్మాస్త్రః పార్ట్ వ‌న్ శివ‌` సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. మ‌రోవైపు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న `ద ఘోస్ట్` కూడా ఇదే ఏడాది తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.