Read more!

English | Telugu

మహేష్ భామతో బన్నీ రొమాన్స్ ?

 

బన్నీ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే లాంచనంగా ప్రారంభమయ్యాయి. ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించనుంది. కానీ ఇందులో మరో హీరోయిన్ గా ప్రణీత నటించనుందనే వార్తలు వినిపించాయి. కానీ ఇపుడు ఆ స్థానంలో కృతిసనన్ ను తీసుకున్నట్లు తెలిసింది. మహేష్ "1 నేనొక్కడినే" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతిని బన్ని సరసన సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ చిత్రంతోనైనా వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.