Read more!

English | Telugu

ఇప్పుడున్న దర్శకులకు అంత సీన్ లేదా?

 

"చందమామ కథలు" చిత్రంతో మరోసారి మన ముందుకు వచ్చిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ టాలీవుడ్ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవలే ప్రవీణ్ తెరకెక్కించిన 'చందమామ కథలు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా పత్రికతో ముచ్చటించారు. అందులో భాగంగా ఆ పత్రిక వారు .... " విదేశాల్లో విదేశాల్లో మంచి ఉద్యోగం ఉంది, చేతినిండా సంపాదన ఉన్న మీకు సినిమాలపై దృష్టి ఎందుకు మరలింది? అని అడిగిన ప్రశ్నకు ప్రవీణ్ స్పందిస్తూ... నాకు సినిమాలంటే ప్రాణం. ముఖ్యంగా కె. విశ్వనాధ్ గారి అభిమానిని. ఆయన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో సినిమాలు తీసే దర్శకులు నాకు ఎవ్వరూ కనిపించలేదు. మంచి సినిమా అంటే మలయాళం, హిందీ, తమిళ సినిమాలవైపే అందరూ చూస్తున్నారు కానీ, తెలుగు సినిమా వంక ఒక్కరు కూడా చూడటం లేదు. అందుకే నా వంతు ప్రయత్నంగా తెలుగులో మంచి సినిమాలు తీయాలనే తలంపుతో దర్శకున్నయ్యాను" అని చెప్పుకొచ్చారు.

అంటే ఈయన దృష్టిలో ఇప్పుడున్న పూరి జగన్నాథ్, రాజమౌళి, వినాయక్, కృష్ణవంశీ వంటి టాప్ దర్శకులంతా వృధా అని ఇతని అభిప్రాయమా? అంటే వీరి వల్ల తెలుగు సినిమా స్థాయి తగ్గిపోతుందని ఇతని ఉద్దేశ్యమా? కె.విశ్వనాధ్ గారి సినిమాలంటే అందరికి ఇష్టమే. కానీ ఇపుడున్న పరిస్థితులు, మారుతున్న కాలం దృష్ట్యా అలాంటి సినిమాలు చూసే పరిస్థితిలో జనాలు లేరు. ప్రస్తుతం టాలీవుడ్ కలెక్షన్లు తిరగరాస్తున్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ సినిమాలే. ఒకవేళ కమర్షియల్ సినిమాలు కాకపోయినా అందులో కొంచెమైన లవ్, యూత్, ఫ్రెండ్స్ అనే అంశాలు ఉంటే సినిమా హిట్టవుతుంది. ఉదాహరణకు. ఆనంద్, స్వామి రారా..వంటి ఎన్నో చిన్న చిన్న చిత్రాలు కూడా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. కానీ అవన్నీ కూడా విశ్వనాధ్ గారి రేంజులో లేవు. కానీ విజయం సాధించాయి.

మరి ప్రవీణ్ సత్తార్ ఇప్పటికైనా ఈ సత్యాన్ని తెలుసుకుంటే మంచిది. లేదంటే విశ్వనాధ్ గారి తీసినటువంటి సినిమాలే తీస్తాను అంటే స్వాతిముత్యం వంటి సినిమాలను రీమేక్ చేసుకోవలసిందే తప్ప కొత్త కథలు దొరకవు.