English | Telugu

కార్తికి విల‌న్ గా జ‌గ‌ప‌తి బాబు!

కోలీవుడ్ స్టార్ కార్తి - వెర్స‌టైల్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తి బాబు ఢీ కొట్ట‌నున్నారా? అవునన్న‌దే కోలీవుడ్ టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `క‌నా` (`కౌస‌ల్య కృష్ణ‌మూర్తి` మాతృక‌), `నెంజుకు నీతి` చిత్రాల‌తో త‌మిళ‌నాట ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు పొందిన అరుణ్ రాజా కామ‌రాజ్.. త్వ‌ర‌లో కార్తిని డైరెక్ట్ చేయ‌నున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాలో కార్తి ఓ డిఫ‌రెంట్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నార‌ట‌. కాగా, ఈ చిత్రంలో శ‌క్తిమంత‌మైన ప్ర‌తినాయ‌కుడి పాత్ర ఉంద‌ట‌. అందులో జ‌గ‌ప‌తి బాబుని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. స‌బ్జెక్ట్, రోల్ న‌చ్చ‌డంతో జ‌గ్గూ భాయ్ కూడా ఆస‌క్తి చూపిస్తున్నార‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే కార్తి చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది `విరుమ‌న్`, `పొన్నియ‌న్ సెల్వ‌న్: 1`, `స‌ర్దార్` చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు కార్తి. వీటిలో `విరుమ‌న్` ఆగ‌స్టు 31న రిలీజ్ కానుండ‌గా.. `పొన్నియ‌న్ సెల్వ‌న్: 1` సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది. ఇక జ‌గ‌ప‌తి బాబు విష‌యానికి వ‌స్తే.. `స‌లార్`, `క‌బ్జా` (క‌న్న‌డ‌), `క‌బీ ఈద్ క‌బీ దివాళి` (హిందీ) వంటి భారీ బ‌డ్జెట్ మూవీస్ తో బిజీగా ఉన్నారు.