Read more!

English | Telugu

బాలయ్య సినిమాలో బస్ ఫైట్.. అసలుసిసలు మాస్!

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా ఉంటే పవర్ ఫుల్ డైలాగ్స్, భారీ ఫైట్స్ ఆశిస్తారు ఆయన అభిమానులు. బాలయ్య గత చిత్రం 'అఖండ'లో కంటెంట్ తో పాటు అభిమానులు కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఆ సినిమా అంతటి విజయాన్ని అందుకుంది. బాలయ్య తరుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నాయి.

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ అందులో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలియజేశాయి. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న చిత్రంలోనూ భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య ఇమేజ్ ని, ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకొని అనిల్ ఓ అద్భుతమైన బస్ సీక్వెన్స్ ని డిజైన్ చేశాడట. ఈ బస్ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది అంటున్నారు.