English | Telugu
నరేశ్, పవిత్ర మధ్య దూరం.. కారణం ఆమేనా?
Updated : Oct 18, 2022
కొద్ది రోజుల క్రితం సీనియర్ యాక్టర్ నరేశ్, కన్నడ నటి పవిత్రా లోకేశ్ మధ్య అనుబంధం అన్ని రకాల ప్రచార మాధ్యమాల్లో కోడై కూసింది. బెంగళూరులో ఇద్దరూ ఓ హోటల్ రూమ్‌లో ఉండగా, నరేశ్ మూడో భార్య రమ్య పోలీసులను తీసుకెళ్లి మరీ వారి వ్యవహారాన్ని బయట పడేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేశ్ ఇలా మరో స్త్రీతో వ్యవహారం నడిపిస్తున్నాడంటూ ఆరోపించడం, హోటల్ రూమ్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన నరేశ్ ఏదో సాధించినట్లు వేలు చూపించడం పతాక శీర్షికల కెక్కింది.
ఇలా తన వ్యక్తిగత ప్రవర్తన నలుగురి నోళ్లలో నానడంతో.. హోటల్ ఘటన జరిగిన తర్వాత నరేశ్ కాస్త జాగ్రత్తగా వుంటూ వస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ పవిత్రతో అతను మళ్లీ ఎక్కడా పబ్లిక్‌గా కనిపించలేదు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహా మేరకే అతను పవిత్రతో కలిసి బయట తిరగడం మానేశాడని ఇండస్ట్రీలో వినిపించిన మాట.
కాగా ఇప్పుడు మరోసారి నరేశ్ గురించిన ఓ ప్రచారం మొదలైంది. పవిత్రను నరేశ్ దూర పెడుతున్నాడనీ, దీనికి కారణం.. ఆయనకు మరో సీనియర్ తార సన్నిహితం కావడమేననేది ఆ ప్రచారం సారాంశం. ఆమె గతంలో హీరోయిన్గా నటించినామేనట. ఇందులో నిజం ఏ మేరకుందనేది తెలీదు. నరేశ్ కోసం ఏమైనా చేస్తాననీ, ఆయనకెప్పుడూ సపోర్ట్‌గా ఉంటాననీ ఇదివరకు పవిత్ర మీడియా సమక్షంలోనే చెప్పారు. అలాంటిది.. ఆ ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగిందనేది వారికే తెలియాలి.