English | Telugu

'సిటిజ‌న్'గా రామ్ చ‌ర‌ణ్!

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త్వ‌ర‌లో `సిటిజ‌న్`గా ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారా!? అవున‌న్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఈ ఏడాది `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య‌` వంటి మ‌ల్టిస్టార‌ర్స్ తో ప‌ల‌క‌రించిన రామ్ చ‌ర‌ణ్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్ లో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లో చ‌ర‌ణ్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు టాక్. కాగా, ఈ చిత్రానికి ఆ మ‌ధ్య `స‌ర్కారోడు`, `అధికారి` వంటి టైటిల్స్ వినిపించాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. `సిటిజ‌న్` అనే యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న టైటిల్ ని ప్లాన్ చేశార‌ట శంక‌ర్. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మ‌రి.. ఇప్ప‌టికే ఇంగ్లిష్ టైటిల్స్ తో ప‌లు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న శంక‌ర్.. `సిటిజ‌న్`తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తారేమో చూడాలి.

ఇదిలా ఉంటే, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కి జోడీగా కియారా అద్వాని క‌నిపించ‌నుండ‌గా.. అంజ‌లి, శ్రీ‌కాంత్, జ‌య‌రామ్, సునీల్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కి బాణీలు అందిస్తున్నాడు.