English | Telugu

`జైల‌ర్`లో గృహిణిగా ఐష్!?

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఐశ్వ‌ర్యా రాయ్.. త‌మిళంలోనూ చెప్పుకోద‌గ్గ స్థాయిలో సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం ఈ అందాల తార‌.. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న `పొన్నియ‌న్ సెల్వ‌న్`లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి భాగం `పీఎస్ 1`.. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా సెప్టెంబ‌ర్ 30న జ‌నం ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే, `ఎందిర‌న్` (తెలుగులో `రోబో`) త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ తో ఐశ్వ‌ర్యా రాయ్ మ‌రోసారి జ‌ట్టుక‌డుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `జైల‌ర్` అనే టైటిల్ తో రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌నుంది. కాగా, ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యా రాయ్ గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ట‌. పాత్ర నిడివి త‌క్కువే అయినా.. అభిన‌యానికి ఆస్కార‌మున్న వేష‌మ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే `జైల‌ర్`లో ఐష్ ఎంట్రీ, రోల్ పై క్లారిటీ రానుంది.

కాగా, 2023 వేస‌విలో విడుద‌ల కానున్న `జైల‌ర్`లో ప్రియాంక అరుళ్ మోహ‌న్ ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని టాక్. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి సంగీత‌మందించ‌నున్నాడు.