Read more!

English | Telugu

'ఎన్టీఆర్ 31'లో బిగ్ సర్ ప్రైజ్.. విలన్ గా తారక్!

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. తన 30వ సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న తారక్.. 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

 

'కేజీఎఫ్-2'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'సలార్' చేస్తున్నాడు. ఆ తర్వాత 'ఎన్టీఆర్ 31' చేయనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం అదిరిపోయే ప్లాన్ వేశాడట. ఇందులో తారక్ హీరోగానూ, విలన్ గానూ కనిపించనున్నాడట. గతంలో 'జై లవ కుశ' సినిమాలో జై పాత్రతో తన విలనిజం చూపించి మెప్పించాడు తారక్. అలాగే 'టెంపర్'లోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'ఎన్టీఆర్ 31' కోసం తారక్ ని పూర్తిస్థాయి విలన్ రోల్ లో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. అంటే ఈ చిత్రంలో తారక్ తో తారకే తలబడనున్నాడన్నమాట.

 

ఈ వార్త నిజమైతే తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. ఏ పాత్రైనా పోషించి మెప్పించగలడన్న పేరున్న తారక్ ని పవర్ ఫుల్ నెగటివ్ రోల్ లో చూడాలని ఫ్యాన్స్ కోరిక. మరి నిజంగానే 'ఎన్టీఆర్ 31'లో తారక్ హీరోగా, విలన్ గా కనిపించి అలరిస్తాడేమో చూడాలి.